అజీర్ణ నివారిణిగా వాము



అజీర్ణ నివారిణిగా పరిగణించే వాము మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచటమే గాకుండా, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను కూడా రాకుండా కాపాడుతుంది. ఇది డయేరియాకు కూడా మంచి మందు. అలాగే శ్వాస సంబంధ సమస్యలను తగ్గించడమేగాక, గుండె దగ్గర ఉండే కండరాలకు మేలు చేస్తుంది. విపరీతమైన తలనొప్పి, జలుబు, ముక్కు దిబ్బడతో బాధపడుతున్నపుడు ఒక చిన్నవస్త్రంలో కాస్తంత వాము వేసి మూటలాకట్టి వాసన పీల్చుకుంటే, నిమిషాల్లో ఉపశమనం కలిగిస్తుంది. వామును నీళ్లలో నానబెట్టి, ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.

వాము, ధనియాలు, జీలకర్రలను దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. వాము, మిరియాలు,ఉప్పు, సమాభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ప్రతి రోజు భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి. వామును కరక్కాయి. ఉసిరికాయ, తానికా యలతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి. వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.వామును మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళనుకరి గిస్తుంది. ప్రసవానంతరం స్త్రీలు వాము వాడితే చనుపాలు వృద్ధి అవుతాయి.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.