రోజంతా యాక్టివ్‌గా, హ్యాపీగా వుండడానికి కొన్ని టిప్స్


రోజంతా యాక్టివ్‌గా, హ్యాపీగా ఉండాలా?
ఇవిగోండి టిప్స్!

రోజంతా యాక్టివ్‌గా, హ్యాపీగా ఉండాలా? అయితే ఈ టిప్స్ పాటించండి. ముందుగా మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. అలాగే డైట్, వ్యక్తిగత అలవాట్లలో మార్పులు అవసరం అవుతాయి.

యాక్టివ్‌గా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోండి. బ్రేక్ ఫాస్ట్‌‌లో అధికంగా ప్రోటీనులు తీసుకొనే మహిళలు అప్పుడప్పుడు హై ఫ్యాట్ స్నాక్స్ మరియు అధికంగా ఉండే షుగర్ ఫుడ్ ఈవెనింగ్ టైమ్‌లో తీసుకోవడం చేయాలి. గుడ్లు పూర్తి పోషకాంశాలతో నిండి ఉంటుంది. పచ్చసొనలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇది మూడ్‌ను రెగ్యులేట్ చేస్తుంది

ఫిజికల్ ఎక్సర్ సైజ్ చాలా ముఖ్యం మరియు కొంచె బ్రిస్క్ వాక్ లేదా జాగింగ్ తక్షణ శక్తిని అందిస్తుంది సన్ స్క్రీన్ లోషన్ /ఎస్ ఫిఎప్‌తో ఉన్న వాటిని చర్మానికి అప్లై చేసి, సన్ టాన్ నివారించుకోవాలి. వింటర్‌లో కూడా సన్ స్క్రీన్ అప్లై చేయవచ్చు. చర్మ పగుళ్ళను ఇది నివారిస్తుంది.

ఇంట్లో కానీ, ఆఫీస్‌లో కానీ, మీరు ఆకలితో కానీ, లేదా దాహంతో కానీ అలాగే ఉండి పనిచేసుకోకూడదు. ఎప్పుడూ అదికంగా నీళ్ళు త్రాగాలి. కాఫీని నివారించాలి. దాంతో మీ ఆకలి కోరికలు తగ్గించవచ్చు. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌ను నమలడం వల్ల మూడ్ మారుతుంది మరియు మిమ్మల్ని శక్తివంతులుగా మారేలే చేస్తుంది.
ప్రతి రోజూ క్రమం తప్పకుండా వేకువ జామున లేదా ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామం చేయడానికి సమయం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.