గెలిచినవారి జీవితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే వాటినే గెలుపుకు దారి అనుకుంటూ కలల్లో విహరించడం, ఆ దారిలో ఓటములు ఎదురైనప్పుడు కుంగిపోవటం సమంజసం కాదు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి. అది మనసుకు అలవాటుకు చేసుకోవాలి. ఇది యోగాభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది. అయితే కొంతమందికి అసలు యోగా ఎందుకు చేయాలి...? అనే సందేహం వస్తుంది. పుట్టినప్పటి నుంచి మనం ఎన్నోసార్లు రకరకాల దుస్తులను ధరిస్తూ... మారుస్తూ ఉంటాము. ఎన్నోసార్లు ఇల్లు మారుతూ ఉంటాము. అలాగే భుజించే ఆహారం కూడా రకరకాల రుచులలో భుజిస్తున్నాము. కాని మార్పు లేకుండా కడవరకూ మనతో ఉండేది శరీరం. కనుక మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, మన కల నెరవేర్చడానికి ఆ శరీరం తోడ్పడుతుంది. must read రాగి నీటితో లక్షలు కాపాడుకొనే చిట్కాలు!! మనసు మీరు చెప్పిన విధంగా వినకుండా, దాని ఇష్ట ప్రకారం ఆలోచనలను పెంపొందిస్తుంది. కనుక మీ కలలు నెరవేరాలంటే, మీ మనసు పట్టుదలతో తోడ్పడాలి. మీ మనసు, శరీరం మీకు నచ్చిన విధంగా పనిచేయాలంటే వాటి రెండింటినీ మీ అదుపులోకి తెచ్చుకోవాలి. అలా అనుకూలంగా మరల్చగలిగే శక్తి యోగా ఇస్తుంది. కనుక యోగాభ్యాసం ఎంతైనా అవసరం. కుళ్లూ, కుతంత్రాలతో నిండిపోయిన నేటి సమాజంలో యోగా తప్పనిసరి.
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.