గృహప్రవేశము చెయువిధానం

గృహప్రవేశము:
ఒక పళ్ళెములో పసుపు, కుంకుమ, నవధాన్యములు, ఉప్పు, పెరుగు, కందిపప్పు, కవ్వము, నిమ్మకాయలు, చాకు, కుడుములు, కొబ్బరికాయలు 12, పంతులుగారి జాబితా ప్రకారము తీసుకొనవలెను. ఆడవారు పూజ పళ్ళెము, మగవారు సీతారాముని, లక్ష్మీదేవి పటములు పట్టుకుందురు.

కుడుములు

కావలసినవి: బియ్యంపిండి 1 డబ్బా, బెల్లము, ఉప్పు, పచ్చిశనగపప్పు గుప్పెడు, నీళ్ళు.
బియ్యంపిండిలో బెల్లము వేసి, వేడి నీరు పోసి, పచ్చిశనగపప్పు కలిపి ఇడ్లి పళ్ళెములలో వండవలెను. 1డబ్బా పిండికి - 10 కుడుములు వచ్చును.

గృహప్రవేశము అయినాక కుడుముల టిఫిను మూత తీయవలెను. కుడుము ఆవిరి ఇంట్లోకి రావలెను. ముందు గుమ్మడికాయ మెల్లాలో కొట్టిస్తారు. ఆవును, దూడను, తెచ్చి ఇంట్లోతిప్పి, తీసుకువెళతారు
.
must read  యోగా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి..?
గృహప్రవేశము పీటలమీదకు, ఆకులు 1 కట్ట, వక్కలు 100గ్రా, ఎండుఖర్జూరము 250గ్రా, పసుపుకొమ్ములు 250గ్రా, అరటిపండ్లు 12, కొబ్బరికాయలు 2, బియ్యము 2 1/2 కేజి, పీటలమీద తుండు, కట్టుబడి సామాను పెట్టి పూజచేయించెదరు.

పుట్టింటివాళ్ళు కట్నాలు తీసుకురావాలి. పొంగలి గిన్నె పుట్టింటి వారు ఇవ్వవలెను, ఇత్తడి గిన్నె, గరిట, మూత, పొంగలి గిన్నె, ఇంటి ఆడవాళ్ళుకాని, ఆడపడుచు కాని పొయ్యి మీద పెట్టవచ్చును. గిన్నెకు పసుపురాసి బొట్టుపెట్టి పాలుపొంగినాక పొంగలి చేయవలెను. ఆడపిల్లకు బంగారముకాని దక్షిణ కాని ఇవ్వవలెను. పొంగలిగిన్నె పొయ్యిమీద పెట్టినాక బొట్టు పెట్టి ఇవ్వవలెను. పాతగుడ్డ ఏదైనా, మసిగుడ్డగా కావలెను. వాస్తుపూజ అయినాక పొంగలి, కుడుములు, అల్లపచెట్ని పెట్టి అందరికి ఇవ్వవలెను. సత్యనారాయణ వ్రతము చేసి అందరికి భోజనము ఏర్పాటు చేసుకోవలెను. పేపరు ప్లేట్లు, గ్లాసులు, మంచినీరు ఏర్పాటు చేసుకోవలెను. జంపకనాలు, కుర్చీలు కావలెను. కొబ్బరికాయ కొట్టటానికి ఒక గుండ్రాయి ఏర్పాటు చేసుకోవలెను. గుమ్మడికాయకు కళ్యాణం బొట్టు పెట్టవలెను.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.