రాగిపిండి సూప్ తయారుచేసే విధానం Dishes , ragipindi soup ఉపయోగాలు :- రాగిపిండిలో ఫైబర్ శాతం చాలా ఎక్కువ. ఈ సూప్ తీసుకుంటే చాలా ఆరోగ్యంగా, అలసట రాకుండా ఉంటాము. దీన్ని తీసుకోవడం వల్ల బాడీలో ప్రోటీన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రతిరోజూ దీనిని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాము. కావలిసిన పదార్ధాలు :- వాటర్- 2 గ్లాస్సెస్ రాగి పిండి- 3 స్పూన్స్ కరివేపాకు- కొంచెం గ్రీన్ చిల్లి – 2 అల్లం- చిన్న ముక్క మజ్జిగ – 1 కప్ రాక్ సాల్ట్ :- రుచికి తగినంత నిమ్మకాయ:- 1 కొత్తిమీర-కొంచెం తయారు చేయు విధానం:- \ ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 గ్లాస్సెస్ వాటర్ పోసి బాగా మరగనివ్వాలి. మరిగిన వాటర్ లో రాగిపిండిని వేస్తూ గరిటితో కలపాలి. ఎందుకంటే ఉండా కట్టే అవకాశం ఉంది. 3 టూ 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపాలి. వేరొక బౌల్ తీసుకొని దానిలో కరివేపాకు వేసి వేగించాలి ఒక 2 నిముషాలు వేగించి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకొని మద్యలో గాటు పెట్టి ఫోర్క్ కి గుచ్చి స్టవ్ మీద కాలాచాలి. అదే విధంగా అల్లం కూడా ఫోర్క్ కి గుచ్చి స్టవ్ మీద కాలాచాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ఈ మూడు మిక్స్ జార్ లో తీసుకొని మిక్స్ చేయాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో మజ్జిగ తీసుకొని దానికి ఈ పొడిని కలపాలి. తర్వాత రాక్ సాల్ట్ కలపాలి. ముందుగా రెడీ చేసుకున్న రాగిపిండి జావాలో ఈ మిక్సర్ కలపాలి. తర్వాత దీని ఒక బౌల్లో తీసుకొని దానిపై కొంచెం నిమ్మరసం కొత్తిమీర వేసి తాగండి. Share on Facebook Share on Twitter Share on Google Plus About sukanya This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel. RELATED POSTS