బ్రహ్మ ముహుర్తం ప్రత్యేకత ఏంటి ?


బ్రహ్మ ముహూర్తానికి”, హిందూ మతం లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.పురాణాల కధ ఇలా ఉంది …

కశ్యప బ్రహ్మ , వినత ల తనయుడు “అనూరుడు “.సూర్యుని సారధి గా పుత్రున్ని చూడాలన్న కోరికతో “వినత” తన అండం ముందుగా పగులగొట్టి సగం శరీరం ఉన్న “అనూరుడిని” బయటకు తెచ్చింది.బ్రహ్మ దేవుడు “అనూరుడిని” ,సూర్యునికి సారధిగా నియమించి , నీవు భూలోకం లో మొదటగా కనిపించిన కాలాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయం లో గ్రహాలు,నక్షత్రాలు ఎటువంటి చెడు చేయలేవని వరమిచ్చాడు.


ఒక పనిని ప్రారంభించడానికి ఒక సమయాన్ని అనుకొంటూ ఉంటాం , అలా నిర్ణయించుకున్న సమయాన్ని ముహుర్తం అంటారు. ఏదైనా ఒక పని చేయాలనుకోన్నప్పుడు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఒక మంచి సమయాన్ని చూసుకొని దానిని మంచి ముహుర్తం గా నిర్ణఇస్తారు. తెల్లవారుజామును (సూర్యోదయానికి ముందు ఉన్న కాలం ) మంచి ముహుర్తం అంటారు. తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు. తెల్లవారుజామున రెండు ఘడియల ముందు కాలాన్ని ( 48 నిమిషముల ముందు కాలాన్ని ) “ఆసురీ ముహూర్తం” అని “ఆసురీ ముహుర్తానికి” ముందు “48 నిమిషముల” ముందు కాలాన్ని “బ్రహ్మ ముహూర్తం” అంటారు.

must read అప్పగింతలు అంటే ఏంటి

తెల్లవారుజామున ప్రారంబించే పనులు ఏటువంటి ఆటంకాలు సాగుతాయంటారు.ప్రతి దినం బ్రహ్మముహుర్తమున ప్రారంబించిన పనులు నిర్విరామం గా , ఎటువంటి ఆటంకము లేకుండా జరుగుతాయంటారు.ఎక్కువమంది నూతన గృహప్రవేశంనకు ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయం లో పనులో చేస్తే మన మేధస్సుకు , భగవంతుని ఆశీస్సులు తోడవుతాయని అంటారు. ఆ సమయం ప్రశాంతంగా ఉంటుంది. సత్వగుణ ఆవిర్భావానికి అనుకూలంగా ఉంటుంది. రోజూ ఆ సమయంలో నిద్ర లేవడం ఉత్తమం. ధ్యానానికి, చదువుకోవడానికి ఆ రోజు చేయవలసిన సత్కార్యాలను నిర్ణయించుకోవడానికి అది ఉత్తమ కాలం.బ్రహ్మ ముహూర్తం లో ప్రారంబించాబోయే పనికి తిధి, వార, నక్షత్ర, దుర్ముహూర్త ములను చూసుకోవలసిన పని లేదు. మంచి పని చేయాల్సివచ్సినా , లేదా కొత్త గా ఏదైనా కొనిగోలు చేసి ఉపయోగించాల్సి వచ్చినా , ఆటంకాలు కలుగుతాయేమో అన్న సందేహం లేకుండా ప్రారంబించవచ్చు




Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.