మాములుగా పచ్చికొబ్బరితో ఇడ్లిలు దోసెలలోకి లేదా టమాటా ఉల్లిపాయలు అలా ఏవేవో చేసుకొంటారు,కానీ ఇది ఒక సారి ట్రై చేసి చూడండి.
పుదీనా ఆకులు బాగాకడిగి ఉంచుకోవాలి ఒక కప్,
ఎండుకొబ్బరి చిన్న గిన్నె తురిమి ఉంచుకోవాలి,
ఎండుమిరపకాయలు ఎంతకావాలో మీ ఇష్టం,
మినపప్పు 2 స్పూన్లు,
బాండిలో నూనె వేసి మినపప్పు ఎండుమిరపకాయలు కొబ్బరి పుదీనా ఒక్కొక్కటిగా వేస్తుబాగావేయించాలి.
చింతపండు ఉప్పు బెల్లం వేసి మరీ మెత్తగా కాకుండా నీరు ఎక్కువ వేసుకోక రుబ్బుకోవాలి గట్టిగా, ఆవాలు ఇంగువ తో పోపు వేసుకోవాలి,అన్నం దోశ చపాతిలోకి బాగుంటుంది,రెండురోజులు పాడవ్వక ఉంటుంది,ఫ్రిడ్జిలో ఒక వారం దాకా ఉంటుంది.