కావాల్సినవి
ఇంట్లో తయారు చేసుకున్న బియ్యప్పిండి - 2 కప్పులు
బెల్లం తురుము - 1 కప్పు
యాలకుల పొడి - అర చెంచా
కొబ్బరి తురుము - 1 చెంచా
నెయ్యి - చెంచా
నూనె - వేయించడానికి సరిపడా
బియ్యప్పిండి తయారీ
బియ్యాన్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వడకట్టి మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి కొంచెం తేమగా ఉండేలా చూసుకోవాలి.
must read చేతితో భోజనం ఎంత ఉపయోగమో తెలుసా ?
తయారీ విధానం
పెద్ద బాణలిలో బెల్లం తురుము వేసి అందులో కొన్ని నీళ్లు పోసి చిన్న మంటపై బెల్లం కరిగే వరకు ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి తిరిగి అదే పాత్రలో తీసుకొని చిన్న మంటపై పాకం వచ్చే వరకూ వేడి చేయాలి. తర్వాత స్టవ్ కట్టేసి.. బెల్లం పాకంలో యాలకుల పొడి, కొబ్బరి తురుము, చెంచా నెయ్యి.. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న బియ్యప్పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని చల్లారనివ్వాలి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్నీ చేసుకోవాలి. తర్వాత డీప్‌ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి అందులో ఈ ముద్దల్ని వేసి స్టవ్ సిమ్‌లో పెట్టి బంగారు రంగులో వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకుని చల్లారనివ్వాలి. అంతే చూడగానే నోరూరిపోయే పాకుండలు రడీ..
ఆరోగ్య ప్రయోజనాలు..
బియ్యప్పిండిలో ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలోని వ్యర్థపదార్థాలను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య దరిచేరకుండా జాగ్రత్త పడచ్చు. అలాగే ఇందులో శరీర ఆరోగ్యానికి కావలసిన ఖనిజాలు, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.
యాలకులు నోటి దుర్వాసనను దూరం చేయడానికి మాత్రమే కాదు.. ఆహారం సులభంగా జీర్ణమవడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే ఇవి శరీరంలోని విషతుల్యాలను తొలగించి.. శ్వాసవ్యవస్థను పటిష్ట పరుస్తాయి.
నెయ్యి వల్ల లావవుతామేమోనన్న భయం అవసరం లేదు. ఎందుకంటే నెయ్యి శరీరంలోని ఇతర అనవసర కొవ్వులను కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణ, రోగనిరోధక వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.
కొబ్బరిలో ఉండే ఫైబర్ రక్తంలోకి గ్లూకోజ్ విడుదలవడాన్ని క్రమంగా తగ్గిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు తగ్గి డయాబెటిస్ బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే శరీర అలసటను తగ్గించి తక్షణ శక్తినివ్వడంలో సహాయపడుతుంది.
బెల్లం తురుము - 1 కప్పు
యాలకుల పొడి - అర చెంచా
కొబ్బరి తురుము - 1 చెంచా
నెయ్యి - చెంచా
నూనె - వేయించడానికి సరిపడా