బారసాల అంటే:

బారసాల:
బారసాల అంటే:
దీనిని అసలు బాల సారె అంటారు. అది వాడుకలోకి వచ్చే సరికి బారసాల అయినది. అసలు బారసాల అంటే పేరు పెట్టటం లేదా నామకరణం చేయటం అని అర్థం. 

ఎందుకు చేస్తారు:

పుట్టిన బాబుకో లేదా పాపకో పేరు పెట్టటానికి చేస్తారు.ఎప్పుడు చేస్తారు:
పుట్టిన 11 వ రోజు నుండి 27 వ రోజు లోపల చేస్తారు. ఈ రోజులలో 11, 21, 27 రోజులలో చాలా మంది చేస్తారు, అలానే బేసి సంఖ్యలు వచ్చే ఏ రోజైనా చేసుకోవచ్చు. ఈ రోజులలో చేసేటట్లైతే మంచి రోజులు చూసుకో నవసరం లేదు. అప్పుడు కుదరక పోతే పాపో, బాబో పుట్టిన 3 నెలల్లో చేస్తారు కానీ వీలుంటే నెలలోపల చేస్తేనే మంచిది. ఎవరు చేస్తారు:
అమ్మాయి పుట్టింటి వాళ్ళు చేస్తారు.

ఎక్కడ చేస్తారు:

అమ్మాయి ఇంటిలో చేస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి, పుట్టిన బాబుకో, పాపకో బట్టలు పెట్టాలి.

ఎలా చేస్తారు:

మొదట విఘ్నేశ్వరుని పూజ చేస్తారు తరువాత పుణ్యఃవచనము(శుద్ధి)చేస్తారు. అయిన తరువాత కటి సూత్ర ధారణ అంటే మొలతాడు కడతారు. తరువాత నామకరణం చేస్తారు. పేరు అనేది కొందరు నక్షత్రం ప్రకారం పెడతారు. కాని కొందరు విడిగా తమకు ఇష్టమైన పేరు పెడతారు. కాని నక్షత్రం ప్రకారం పెడితేనే మంచిది. ఏ నక్షత్రానికి ఏ అక్షరాలు అనేవి ఈ క్రింద ఇస్తున్నాము.
అశ్విని - చూ - చే - చో - ల
భరణి - లి - లూ - లే - లో
కృత్తిక - ఆ - ఈ - ఊ - ఏ
రోహిణి - ఓ - వా - వీ - వూ
మృగశిర - వే - వో - కా - కి
ఆరుద్ర - కూ - ఖం - జ్ఞా - చ్చా
పునర్వసు - కే - కో - హా - హీ
పుష్యమి - హూ - హే - హో - డా
ఆశ్లేష - డి - డు - డె - డో
మఖ - మా - మీ - మూ - మే
పుబ్బ - మో - టా - టీ - టూ
ఉత్తర - టే - టో - పా - పీ
హస్త - పూ - ష - ణా - ఠా
చిత్త - పే - పో - రా - రీ
స్వాతి - రూ - రే - రో - త
విశాఖ - తీ - తూ - తే - తో
అనూరాధా - నొ - నీ - నూ - నే
జ్యేష్ఠ - నో - యా - యీ - యూ
మూల - యే - యో - బా - బి
పూర్వాషాఢ - బూ - ధా - భా - ఢ
ఉత్తరాషాఢ - బే - బో - జా - జీ
శ్రవణం - జూ - జే - జో - ఖా
ధనిష్ట - గా - గీ - గూ - గే
శతభిషం - గో - సా - సీ - సూ
పూర్వాభాద్ర - సే - సో - దా - దీ
ఉత్తరాభాద్ర - దు - శ్యం - ఝూ - థా
రేవతి - దే - దో - చా - చీ

ఇచ్చి పుచ్చుకోవటాలు:

అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి, పుట్టిన బాబుకో లేక పాపకో బట్టలు పెట్టాలి. మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన వారికి పండు తాంబూలం, పెట్టదలచు కుంటే చుట్టాలకు భోజనము పెట్టవచ్చు.
ఇదే రోజున ఉయ్యాలలో వేయటము, బావిలో చేద వేయటం అనే కార్యక్రమాలు చేస్తారు.

ఉయ్యాలలో వేయటం అంటే పిల్లవాడిని ఉయ్యాలలో వెయ్యాలి కాబట్టి సాంప్రదాయంగా ఆ రోజున మొదలు పెడతారు. కొంత మంది ఆ రోజున చేయకుండా 21 వ రోజున చేస్తారు. ఎందుకంటే బావిలో చేద వేయటం, ఉయ్యాలలో వేయటం రెండు ఒకే రోజున చేస్తారు కాబట్టి, అమ్మాయి ఇంకా పనులు చేసుకోలేని స్థితిలో ఉంటే ఇది తరువాత చేస్తారు.

బావిలో చేద వేయటం అంటే అంత వరకు ఆ అమ్మాయి పనులేమి చేయదు కనుక ఆ రోజున బావిలో చేద వేయించి ఆమె అన్నీ పనులు చేయ వచ్చు అని చెప్పటం కోసం అన్న మాట.

కావలసిన వస్తువులు:

పసుపు - 50 గ్రా.
కుంకుమ - 50 గ్రా.
ఆకులు - 1 కట్ట.
వక్కలు - 25 గ్రా.
పూలు - కావలసినన్ని.
పండ్లు - 1 డజను.
కొబ్బరి కాయలు - 2.
బియ్యం - 2 కేజీలు.
చిల్లర - 10 రూపాయలు.
గంధం - 1 డబ్బా (టిన్).
నూనె, వత్తులు - దీపారాధన చేయటానికి.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.