దోమలను తరిమేద్దాం.!
.
ఎలాంటి హానీ లేకుండా సహజసిద్దమైన పదార్థాలతో తయారుచేసిన ద్రవం ద్వారా దోమలను ఎలా చంపవచ్చో తెలుసుకుందాం. కొద్దిగా నీటిని తీసుకొని వేడి చేసి చల్లార్చాలి. ఒక ప్లాస్టిక్ బాటిల్ను తీసుకొని మధ్యలో రెండుగా కత్తిరించాలి. దాన్నించి కింద భాగం తీసుకొని ముందుగా సిద్ధం చేసుకున్ననీటిని అందులో పోయాలి. ఆ నీటిలో కొద్దిగా చెక్కెర, కొంచెం ఈస్టును వేయాలి. ఈస్ట్ మనకు కిరణా షాపులలో, సూపర్ మార్కెట్లలో, బేకరీలలో దొరుకుతుంది. తరువాత కొంచెం తేనెను ఆ మిశ్రమంలో కలపాలి.
ఇప్పడు ప్లాస్టిక్
బాటిల్ మిగిలిపోయిన రెండో ముక్కను పైభాగాన్నిరివర్స్ చేసి కింద భాగంలో పెట్టాలి. రెండు ప్లాస్టిక్ ముక్కలు కలిసేచోట జిగురును కానీ, టేప్ ను కానీ అంటించాలి. దీంతో అవి ధృడంగా ఉంటాయి. ఇలా తయారైన ద్రవం నుంచి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతూ ఉంటుంది.
must read శ్రీ కృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం
మన (పాలిచ్చే జంతువుల) రక్తంలోని ఓ ఎంజైమ్ ఆడదోమ గుడ్లు పెట్టడానికి అవసరం కాబట్టే, ఆడదోమ మాత్రమే మనల్ని కుడుతుంది. మనల్ని వెదకటానికి అవి కనిపెట్టుకున్న ఓ మార్గం మన నుండి వెలువడే కార్బన్ డయాక్సైడ్ కావడంతో మనం తయారు చేసుకున్న బాటిల్ నుండి వెలువడే CO2 దోమలను ఆకర్షిస్తుంది. దీంతో దోమలు ఆ ద్రవం వద్దకు వచ్చి అందులో పడి చనిపోతాయి. ఇలా దోమలను విజయవంతంగా నిర్మూలించవచ్చు. దీన్ని గదిలో ఏదైనా ఓ ప్రదేశంలో పెడితే చాలు. ఆ గదిలో ఉన్న దోమలన్నీ అక్కడకు వచ్చి చనిపోతాయి. అయితే ఇది కేవలం కొద్దిరోజులు మాత్రమే పనిచేస్తుంది. చనిపోయిన దోమలతో ఆ బాటిల్ నిండిపోయాక మళ్ళీ అలాగే ద్రవాన్ని తయారుచేసుకొని, బాటిల్స్ ను కత్తిరించి పెడితే సరిపోతుంది.