ఏ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఆరోగ్యంగా వుంటాము..?

భూమికి ఈ ఉత్తర, దక్షిణ వైపుల్లో విస్తరించి ఉన్న భూ అయస్కాంత క్షేత్రం మన శరీరం మీద దుష్ప్రభావం కల్గిస్తుందనీ, అందుకే పెద్దలు ఉత్తర, దక్షిణాల వైపు తలపెట్టి పడుకోవద్దని ముందే తెలిసి చెప్పారనీ బుకాయిస్తున్నారు. కానీ భూమి అయస్కాంత శక్తి మనం ఎటు పడుకున్నా ఒకే విధంగా పనిచేస్తుంది. ఎందుకంటే మన శరీరం ఓ దండాయస్కాంతం కాదు. మన శరీరానికి శాశ్వత అయస్కాంతతత్వం లేదు. తల భాగం ఓ ధ్రువంగాను, కాళ్ల భాగం మరో ధ్రువంగానూ మన శరీరంలో అయస్కాంత బలరేఖలు లేవు.
.
మన శరీరం కోటాను కోట్ల జీవకణాలమయం. ప్రతి జీవకణంలోను అయస్కాంత ధర్మాలున్న కొన్ని జీవరసాయనాలు (ఉదా: సైటోక్లోమ్‌ ఆక్సిడేస్‌, మయోగ్లోబిన్‌, హీమోగ్లోబిన్‌ మొ||) ఉన్నాయి. వాటికి ధ్రువత్వం లేదు. ఏ రూపమూ లేని అమీబాను వేలాడదీస్తే భూమి ఉత్తరదక్షిణాలు, తూర్పు పడమరలు అన్నివైపులా ఒకవిధంగా విస్తరించి ఉండడం వల్ల ఆ అమీబా ఎటున్నా ఎంతో కొంత భాగం ఉత్తర, దక్షిణాలవైపు ఉన్నట్టే కదా! ఆ మేరకే అయస్కాంత ప్రభావం ఉంటుంది. మనం కూడా తూర్పు పడమరల వైపు పడుకున్నా శరీరంలో ఎంతో కొంత భాగం ఉత్తర, దక్షిణాల వైపు ఉంటుంది. (నిజానికి ఉత్తర, దక్షిణాల వైపు పడుకొంటే ఎంత శరీర ఘనపరిమాణం ఉత్తర దక్షిణాలవైపు ఉంటుందో అంతే ఘనపరిమాణం తూర్పు పడమరలవైపు తలపెట్టి పడుకున్నా ఉంటుంది) మనం ఏవైపు తలపెట్టి పడుకున్నా భూ అయస్కాంత ప్రభావంలో ఏమాత్రం తేడా ఉండదు.
.
must read   పడక గదిలో భార్యాభర్తల ఫోటోలు ఉంచాల్సిందే
కాబట్టి ఉత్తర దక్షిణాలకు ప్రత్యేకత ఏమీ లేదు. మన శరీరానికి ఉన్న స్థూపాకార లక్షణాన్ని అర్ధరహితంగా, అశాస్త్రీయంగా, కుహనా శాస్త్రీయంగా అన్వయించుకోవడం పూర్తిగా అసంబద్ధం. గుండ్రంగా ఉన్న సముద్రపు నక్షత్రం, అమీబా, జెల్లీ చేప, పేడ పురుగు, నత్తలు, ముడుచుకుని పడుకొనే జెర్రులు పాములు, వేలాడే గబ్బిలాలు, కోడిగుడ్లు, చెట్లు, కొబ్బరిచెట్లు ఎటున్నా ఏమీ తేడా లేనట్లే, మనం ఎటు పడుకొన్నా తేడా ఉండదు. మనం ఎటు పడుకున్నా ప్రభావం ఒకే తీరుగా ఉంటుంది. ఇబ్బందేమీ లేదు. మనకిష్టం ఉన్న దిశలో హాయిగా పడుకోవచ్చు.
.
-
ప్రొ|| ఎ. రామచంద్రయ్య,జన విజ్ఞాన వేదిక.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.