చద్దన్నం తినడం వలన ఉపయోగాలు





రాత్రి మిగిలి పోయిన అన్నంను పొద్దున్నే తినేందుకు ప్రస్తుత జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నైట్‌ అన్నం ఎంత ఉన్నా కూడా పొద్దున్నే పడేయడం కాని, ఎవరికైనా పెట్టడం కాని చేస్తూ ఉంటారు. అయితే ఆ చద్దన్నంలోనే ఎన్నో ఉపయోగకరమైన పదార్ధాలు ఉన్నాయి అనే విషయం తెలుసుకోవాల్సిన విషయం. చద్దన్నం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయని ఒక సర్వేలో తేలింది. పాత తరం వారు చద్దన్నంను ఎంతో ఇష్టంగా తినేవారట. అందుకే వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉండేదని అంటారు. మన తాతల కాలంలో రాత్రి వండిన అన్నంను పొద్దున్నో పెరుగు కలుపుకుని, మామిడి కాయ చట్నీ వేసుకుని, పచ్చి మిర్చి మరియు ఉల్లిగడ్డ నంజుకుని తింటే బాగుంటుంది. కాని ఇప్పుడు చూద్దాం అన్నా ఏ ఒక్కరు కూడా అలా తినడం లేదు. పల్లెటూరులో సైతం రాత్రి అన్నంను పశువులకు పెట్టడంను మనం చూస్తున్నాం.

అన్నం పులవడం(ఒక రాత్రి ఉంచడం) వల్ల పెరిగే పోషకాల గురించి చెబితే తప్పకుండా షాక్‌ అవుతారు. 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్‌ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పోటాషియం మరియు కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అప్ప‌టి పెద్ద‌వారు ఇప్ప‌టి త‌రం వారికి ఏదైనా చెబితే ఆ... ఏముందిలే, పాత చింత‌కాయ ప‌చ్చ‌డి అని అంతా తీసిపారేస్తారు. వారు చెప్పే మాట‌ల‌కు విలువ‌నివ్వ‌రు. కానీ నిజంగా పెద్ద‌లు చెప్పే మాట‌లే కాదు, వారు తిన్న ఆహారం కూడా ఎంతో విలువైందే. అమెరిక‌న్ డైటెటిక్ అసోసియేష‌న్ వారు తేల్చి చెప్పింది కూడా ఇదే. ఇంత‌కీ వారు చెప్పింది దేని గురించో తెలుసా..? మ‌జ్జిగ క‌లిపిన చ‌ద్ద‌న్నం. అవును, అదే. ఆ ఆహారం ఎంతో విలువైంద‌ని వారు చెబుతున్నారు.

రాత్రి అన్నం తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఇప్పుడు మనం చూద్దాం... చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.

వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.
ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపాలంటే చద్దన్నం పొద్దునట్లే తినాల్సిందే.
పలు చర్మ వ్యాదుల నుండి చద్దన్నం కాపాడుతుందని తేలింది.
పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.
ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అనే వారు.

రాత్రి మిగిలిన అన్నంలో మ‌జ్జిగ‌, ఉప్పు క‌లిపి కుండలో పెడితే ఉద‌యం అయ్యే స‌రికి ఆ అన్నం పులిసి మంచి పోష‌కాల‌తో రెడీ అవుతుంది. లేదంటే రాత్రి పూట అన్నం వండి అందులో కొన్ని పాలు పోసి, తోడుకోవ‌డం కోసం ఓ మ‌జ్జిగ చుక్క‌ను వేసినా ఉద‌యం లేచే సరికి మ‌జ్జిగ‌, చ‌ద్ద‌న్నం త‌యారుగా ఉంటుంది. దీన్ని ప‌చ్చ‌డితోనో, ఉల్లిపాయ‌, మిర‌ప‌కాయ‌ల‌తోనో మ‌న‌వాళ్లు ఉద‌యాన్నే తినేవారు. దీంతో వారు రోజంతా ఎంతో ఉత్తేజంగా, శ‌క్తితో ఉండేవారు. అలా వారు అప్ప‌టికీ, ఇప్ప‌టికీ అదే శ‌క్తితో ముందుకు సాగుతున్నారు. కానీ మ‌న‌మే దాన్ని పూర్తిగా ప‌ట్టించుకోలేదు.

అయితే అమెరిక‌న్ డైటెటిక్ అసోసియేష‌న్ వారు చేసిన ప‌రిశోధ‌న ప్ర‌కారం... సాధార‌ణ అన్నం క‌న్నా పైన చెప్పిన విధంగా త‌యారైన చ‌ద్ద‌న్నంలో ఐర‌న్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు దాదాపుగా 20 రెట్లు ఎక్కువ‌గా ఉంటాయ‌ని తెలిసింది. అందుకే అప్ప‌ట్లో మ‌న పెద్ద‌ల‌కు అంత శ‌క్తి ఉండేది. ఇప్ప‌టికీ వారు ఆరోగ్యంగానే ఉండ‌గలుగుతున్నారంటే అదే కార‌ణం. అమెరిక‌న్ డైటెటిక్ అసోసియేష‌న్ వారు చ‌ద్ద‌న్నం, మ‌జ్జిగ గురించి ఇంకా ఏం చెబుతున్నారంటే...

చ‌ద్ద‌న్నం, మ‌జ్జిగ కాంబినేష‌న్‌లో ఉద‌యాన్నే తిన‌డం వ‌ల్ల రోజంతా శ‌రీరం ఉత్తేజంగా ఉంటుంది. శ‌రీరానికి మంచి చేసే బాక్టీరియా వృద్ధి చెందుతుంది.

వేడి చేసిన వారు ఉద‌యాన్నే ఈ ఆహారం తిన‌డం వ‌ల్ల ఎంతో చ‌లువ పొందుతారు.
మ‌ల‌బ‌ద్ద‌కం, నీర‌సం త‌గ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది.
రోజంతా శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి అందుతుంది. అల్స‌ర్లు రాకుండా ఉంటాయి.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.