వేడి నీరు త్రాగడం వలన ఉపయోగాలు


మన మనుగడకు నీరు చాలా అవసరం. అందుకే వైద్యులు ప్రతి రోజు 8 గ్లాసులు నీటిని త్రాగాలని చెప్పుతున్నారు. అయితే చాలా మందికి వేడి నీటిని త్రాగటం వలన ఊహించని ప్రయోజనాలు ఉంటాయని తెలియదు. అందుకే ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
1. బరువు నష్టం 

వేడి నీరు ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. రోజు ప్రారంభంలో ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగాలి. వేడి నీరు మన శరీరంలో
కొవ్వు కణజాలంను విచ్చిన్నం చేయటానికి సహాయపడుతుంది.

2. గొంతు రద్దీని తగ్గిస్తుంది

వేడి నీరు త్రాగితే జలుబు, దగ్గు మరియు గొంతు నొప్పి నివారణకు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కఫం కరిగించి శ్వాసనాళం నుండి తొలగించడానికి సహాయపడుతుంది. దాంతో గొంతుకు ఉపశమనం కలిగి గొంతు రద్దీని తగ్గిస్తుంది.

3. ఋతు తిమ్మిరి

వేడి నీరు ఋతు తిమ్మిరిని తగ్గించటానికి సహాయపడుతుంది. వేడి నీరు ఉదర కండరాలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. దాంతో తిమ్మిరి మరియు ఆకస్మిక బాధ నయం అవుతాయి.

4. శరీర నిర్విషీకరణ

వేడి నీరు శరీర నిర్విషీకరణకు చాలా బాగా సహాయపడుతుంది. వేడి నీరు త్రాగితే శరీర ఉష్ణోగ్రత చెమట కారణంగా పెరుగుతుంది. శరీరం నుండి విషాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇంకా మంచి పలితాలు రావాలంటే వేడి నీటిలో నిమ్మరసం పిండుకొని త్రాగాలి.

5. అకాల వృద్ధాప్యంను నిరోధిస్తుంది

శరీరంలో విషాన్ని తొలగించి అకాల వృద్ధాప్యంను నిరోధిస్తుంది. వేడి నీరు త్రాగటం వలన చర్మ స్థితిస్థాపకతను పెంచడానికి మరియు హానికరమైన ఫ్రీ రాడికల్స్ ద్వారా ప్రభావితమైన చర్మ కణాలను మరమత్తు చేయటానికి సహాయపడుతుంది.అంతేకాక దెబ్బతిన్న చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

6. మొటిమలను నిరోధిస్తుంది

వేడి నీరు చర్మ సమస్యల కొరకు బాగా సహాయపడుతుంది. వేడి నీటితో ముఖాన్ని కడిగితే మోటిమల వంటి అంటువ్యాధులకు మూలకారణాలను తొలగించటానికి సహాయపడుతుంది.

7. జుట్టు ఆరోగ్యం మరియు తేజము

వేడి నీరు త్రాగటం వలన జుట్టును మృదువుగా,మెరిసేలా చేస్తుంది. జుట్టు మూలాలలో నరాలను ఉత్తేజితంగా మరియు చురుకుగా ఉంచుతుంది. జుట్టుకు సహజమైన మెరుపు మరియు ఆరోగ్యాన్ని ఇస్తుంది.

8. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

జుట్టు మూలాలను ఉత్తేజితం చేయటం ద్వారా మరో ప్రయోజనం ఉంది. వేడి నీరు జుట్టు మూలాలను ఉత్తేజపరచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

9. చుండ్రును నిరోధిస్తుంది

వేడి నీరు తల మీద చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దాంతో పొడి జుట్టు లేదా చుండ్రుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.;

10. రక్త ప్రసరణ మెరుగుదల మరియు ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ

వేడి నీటిని త్రాగటం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే నాడి కణాలు ఉత్తేజితం అవుతాయి. నాడీ వ్యవస్థ దాని చుట్టూ కొవ్వు నిల్వలను చేధించడం ద్వారా ఆరోగ్యంగా ఉంచుతుంది.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.