బొప్పాయి చెట్టు యొక్క ఉపయోగాలు


 దీని పువ్వు నలిపి పేనుకొరికిన చోట రుద్దిన మరలా వెంట్రుకలు వచ్చును. ఇలా 4 నుంచి 5 దినములు చేయవలెను .
* దీని కాండము కి గాటు పెట్టిన పాలు కారును. ఆ పాలని 2 నుంచి 3 సార్లు పూసిన తామర , గజ్జి చిడుము మానును .
* ఈ పాలను 60 చుక్కలు దానికి సమానంగా పంచదార కలిపి మూడు సమాన భాగాలుగా చేసి మూడు పూటలా ఇవ్వవలెను . ఈ ప్రకారం ఇవ్వడం వలన అగ్నిమాన్ద్యం ( Dyspepsia) మానును .
* ఈ పాలు లొపలికి తీసుకొవడం వలన ప్లీహం
లివర్ పెరుగుట పోగొట్టును .
* పచ్చికాయ తీసుకొచ్చి నిలువునా కత్తితో గీతలు పెట్టిన పాలు కారును . ఆ పాలను ఒక చిప్పలో గాని , గాజుగిన్నెలో గాని తీసుకుని కాలుచున్న ఇసుకలో పెట్టిన తెల్లని చూర్ణం అగును. ఇలా అవడానికి 24 గంటల సమయం పట్టును . ఈ చూర్ణం పెద్దవారికి రోజుకీ ఒక్కసారి 2 గొధుమ గింజల ఎత్తు పంచదారతో గాని , పాలతో కాని లొపలికి ఇవ్వవలెను. మిక్కిలి జీర్ణశక్తిని ఇచ్చును.

* బొప్పాయకాయ పాలు తేలుకుట్టిన చోట రాయడం వలన తేలువిషం హరించును.

* పచ్చికాయ వండుకుని తినిన బాలింతలకు పాలు సక్రమంగా వచ్చును.

* బొప్పాయి ఆకు నూరి కట్టిన బోదకాలు వ్యాధి హరించును.

* బొప్పాయికాయ ముక్కలను మాంసం నందు వేసి వండిన మాంసం మెత్తగా ఉడుకును.

* మొలలవ్యాధి కలిగినవారు బొప్పాయి పండు తినిన మొలలు తగ్గును .

* పండు యొక్క గుజ్జు వంటికి పూసిన శరీరం పేలినట్టు ఉండటం మానును .

ముఖ్య గమనిక -

ఈ బొప్పాయిని ఎక్కువ తీసుకోకూడదు. ఆలస్యంగా జీర్ణం అగును. కఫవాతము పెంచును. ముఖ్యంగా గర్బిణి స్త్రీలకు పచ్చికాయని ఇవ్వకూడదు. దీనికి రుతురక్తం జారీచేసే గుణం ఉన్నది. కావున గర్భస్రావం అయ్యే అవకాశం ఉన్నది. కడుపు నిండుగా తిని ఈ బొప్పాయి పండు తినిన జ్వరం వచ్చును. కావున తక్కువ మోతాదులో తీసుకొవడం మంచిది.

దీనికి విరుగుళ్లు -

శొంటి , పిప్పిలి , మిరియాల చూర్ణం లేక కషాయం తీసుకోవడం .
************** కాళహస్తి వెంకటేశ్వరరావు **************

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.