కొబ్బరికాయలను మనలో అధిక శాతం మంది దేవునికి నైవేద్యంగా వాడుతారు. ఇక కొబ్బరిబొండాల్లోని నీటిని తాగేందుకు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. దీంతోపాటు దక్షిణ భారతదేశంలోని కేరళ వంటి రాష్ర్టాల్లో కొబ్బరి నూనెను ఎక్కువగా వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే పూర్తిగా పక్వానికి వచ్చిన కొబ్బరికాయ కొబ్బరి నుంచి తయారయ్యే 'కొబ్బరి పాల'తోనూ మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చాలా మంది కొబ్బరి నీరు, కొబ్బరి పాలు ఒకటేననుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే కొబ్బరినీరు టెంకాయలో సహజ సిద్ధంగా తయారవుతుంది. కొబ్బరిపాలను పూర్తిగా పండిన కొబ్బరి నుంచి తయారు చేస్తారు. ఈ 'పాల'ను తరచూ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. జంతువుల పాలను తాగలేని వారు కాఫీ, టీ వంటి వాటిలో ఆ పాలకు ప్రత్యామ్నాయంగా కొబ్బరి పాలను వాడవచ్చు. తాజా కొబ్బరి పాలు ఆవు పాలకు సమానమైన పోషకాలను కలిగి ఉంటాయి. 2. నోటి పూతలను తగ్గించే గుణం కొబ్బరి పాలకు ఉంది. గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఆవు పాలతో పోలిస్తే కొబ్బరి పాలు సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. 3. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక మోతాదులో ఉంటాయి. ఐబీఎస్, క్రాన్స్ డిసీజ్ వంటి వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంలో కొబ్బరి పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 4. పాస్ఫరస్, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఎముకలకు దృఢత్వం లభిస్తుంది. కొబ్బరి పాలలో ఉండే గ్లూకోజ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు దోహదపడుతుంది. ఇది రక్తంలో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. 5. కీళ్ల నొప్పులకు కొబ్బరి పాలు మందులా పనిచేస్తాయి. ఆర్థరైటిస్కు చక్కని మందుగా పనిచేస్తాయి. శరీరంలో ఏర్పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది. రోజుకో కప్పు కొబ్బరి పాలను తీసుకుంటే రక్తహీనత తొలగిపోతుంది. 6. క్యాన్సర్ బారి నుంచి రక్షించే గుణాలు కొబ్బరి పాలలో ఉన్నాయి. 7. కొబ్బరి పాలు జుట్టు కుదుళ్లు దృఢంగా చేస్తాయి. వీటిని జుట్టుకు పట్టించి అనంతరం తలస్నానం చేస్తే జుట్టుకు మాయిశ్చరైజర్ లభించి మృదువుగా అవుతుంది. 8. కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్లో 2-3 గంటల పాటు ఉంచాలి. అనంతరం బయటికి తీసి దానిపైన ఏర్పడిన పొరను తొలగించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మాడుకు పట్టించి వేడి నీటిలో ముంచిన ఉన్ని టవల్ను తలకు చుట్టాలి. గంట సేపు అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు మృదువుగా తయారవుతుంది. 9. కొద్ది మొత్తంలో కొబ్బరి పాలను తీసుకున్న కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఇవి బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. 10. యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు కొబ్బరి పాలలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. 💥100 గ్రాముల కొబ్బరి పాలలో ఉoడే పోషకాలు... శక్తి - 47 కిలోక్యాలరీలు పిండి పదార్థాలు - 2.81 గ్రా. కొవ్వులు - 21.33 గ్రా. (సాచురేటెడ్ కొవ్వులు - 18.915 గ్రా.) ప్రోటీన్లు - 2.02 గ్రా. విటమిన్ సి - 1 మి.గ్రా. కాల్షియం - 18 మి.గ్రా. ఐరన్ - 3.30 మి.గ్రా. మెగ్నిషియం - 46 మి.గ్రా. పాస్ఫరస్ - 96 మి.గ్రా. పొటాషియo - 220 మి.గ్రా. సోడియo - 13 మి.గ్రా.
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.