మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -మాలకొండ




ప్రకాశం జిల్లా , కందుకురుకు నైరుతి దిశలో సుమారు ఇరువై మైళ్ళ దూరంలో ఉన్న ఈ మాల్యాద్రి పై భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన నవనారసింహుల లో ఒకరైన శ్రీ జ్వాలా నరసింహస్వామి తన దేవేరీ శ్రీ మహాలక్ష్మి తో కొలువైయండీ భక్తుల పాలిట కల్పతరువై ఉన్నారు.
మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కందుకూరు - పామూరు రోడ్డు లో వలేటివారిపాలెం మండల పరిధి లో ఉండే ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారం లో ఉండటం తో ఈ ప్రాంతానికి మాలకొండ ,మాల్యాద్రి అని పేరు వచ్చాయి .
స్థల పురాణం : శ్రీ విష్ణువు శ్రీ మహాలక్ష్మి తో భూలోకం లో విహరించగోరి తన ' వనమాల ' ను పర్వతాకారం దాల్చామని కొరడని వనమాల "మాల్యాద్రి" గా వెలసిందనీ పురాణాగాధ ఉంది. అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపమాచరించగా లక్ష్మి నారసింహుడు జ్వాల రూపుడై దర్శనమిన్చ్చాదని ,జ్వాల నరసిమున్హి గ కొండ పైన వెలిసారు అని పురాణం గాథ .
ప్రకృతి శోబకు నిలయమైన మాలకొండ ఏకశిలా నిర్మితం కావడం విశేషం . జ్వాల నరసింహుని పూజించిన మార్కండేయ ముని సమీపం లోని యేరు లో స్నానం ఆచరించారని అదే మార్కండేయ నది అని చెబుతారు . 

ఈ కొండ పై గల మరొక వింత శ్రీ మహాలక్ష్మి స్వామి వారి పై ప్రణయకోపం తో అలిగి కొండను పగులకొట్టుకొని కొండ శిఖరము పై కూర్చున్నదని పురాణ గాధలలో చెప్పబడినట్లే బ్రాంహందమైన కొండల నడుమ చీలిక ఈరుకైన మెల్లదారి. ఈ దారిలో ఎంతటి స్తులకాయులైననూ నడచి వెళ్ళగలిగే విధముగా నుందుటాయు భక్తులకు అద్భుతం గా తోస్తుంటుంది. ఒకే ఒక రాతి క్రింద ఏర్పడిన విశాలమైన గుహలో శివలింగం ప్రతిష్టించబడి " శివకెశవులు " ఓక్కరెనన్న అధ్యాత్మిక ఉన్నత భావనను కలిగిస్తుంది. శివాలయం దిగువున పార్వతిదేవి ఆలయమున్నది.
ప్రతిసంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దసి నాడు నరసింహజయంతి, కార్తీకమాసం, శ్రావణ మాసములలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు

దర్శన సమయాలు
ప్రతి శనివారం ఉదయం 6 గం. ల నుంచీ, సాయంత్రం 5 గంలదాకా మాత్రమే. సమయం, వారం తప్పక గుర్తుంచుకోండి. సాయంకాలం 5 గం. లయితే స్వామికి అలంకరించిన పూలతో సహా తీసి, ఆలయ ప్రాంతాలు పరిశుభ్రం చేసి ఆలయం మూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ కొండదిగువకు వచ్చేస్తారు.

వసతి
కొండ కింద అన్ని వసతులతో 12 గదులు, సాధారణ వసతితో 30 గదులు, డార్మెటరీ సౌకర్యాలు వున్నాయి. టి.టి.డీ. వారి కళ్యాణ మండపం లో వివాహాలు జరుగుతాయి. భక్తులు ఇక్కడ కేశ ఖండన కూడా చేయించుకుంటారు. దానికి తగిన సదుపాయాలున్నాయి.
ఘాట్ రోడ్డు

కొండ ఎక్కటానికి మెట్ల దోవలు వున్నాయి. మెట్లు ఎక్కలేనివారికోసం ఘాట్ రోడ్డు నిర్మింపబడింది. ఈ మార్గంలో కారులు, ఆటోలు వెళ్తాయి. ఈ రోడ్డు చిన్న చిన్న మెలికలతో వుంటుంది. కొండపైన వాహనం ఆగిన చోటనుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళటానికి వయోవృధ్ధులు, చిన్న పిల్లలున్నవారికోసం ఆలయం వారు నిర్వహించే ఉచిత రవాణా సౌకర్యం కూడా వున్నది.

భోజన వసతి
ప్రతి శనివారం వచ్చిన భక్తులందరికీ దేవస్ధానం వారు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఆసక్తి వున్నవారు శాశ్వత అన్నదానానికి, శాశ్వత పూజలకు రుసుము చెల్లించవచ్చు. వీటికి ఎటువంటి నిర్బంధమూ లేదు.

దర్శనం


స్వామికి దగ్గరగా వెళ్ళి గోత్ర నామాలతో అర్చన చేయించుకోవటానికి మనిషికి రూ. 100 టికెట్ తీసుకోవాలి. ఉచిత దర్శనం గర్భగుడి ముందునుంచీ వుంటుంది.

ఒంగోలు నుండి 80 కి.మీ. లు, కందుకూరునుండి 32 కి.మీ.లు, శింగరాయకొండనుంచీ 40 కి.మీ. ల దూరంలో వున్నది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని చేరుకోవటానికి ఒంగోలు, కందుకూరునుంచి పామూరు వెళ్ళే బస్సులన్నీ కొండ దిగువదాకా వెళ్తాయి. అక్కడనుండి కొండపైకి ఆటోలు లభిస్తాయి. కందుకూరు, శింగరాయకొండలనుంచి ఆటోలలో కూడా వెళ్ళి రావచ్చు. సమయం తక్కువ వున్నవాళ్ళు వెళ్ళి రావటానికి వాహనం మాట్లాడుకుంటే ఇబ్బంది లేకుండా వుంటుంది.
ఈ స్వామిని భూపతులేందరో సేవించినట్లు శాసనమూలున్నవి. విజయనగర ప్రభువగు అచ్యుత దేవారాయలు, రెడ్డిరాజులు, చండీ సంస్థానాధీసులు ఈ స్వామి వారిని సేవించి ధన్యులయిరి. వారు స్వామికి చేసిన సేవలన్నీయు శాసన రూపంలో ఉన్నవి. ఈ ఆలయం ప్రతి శనివారం మాత్రమే తెరువబడును. ఉదయం గం|| 6.00 ల నుండి సాయంత్రం గం|| 5.00 వరకు

వెళ్ళు మార్గం :-
ఈ క్షేత్రానికి వెళ్ళేందుకు బస్సు ద్వారా ఒంగోలు నుండి 80 కి. మీ., కందుకూరు నుండి 35 కి. మీ., సింగరాయకొండ రేల్వే స్టేషన్ నుండి 40 కి. మీ ల లో ఉన్నది


Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.