రక్తపోటు నియంత్రణకు చిట్కాలు



హై బ్లడ్ ప్రెజర్:-(High BP)

అధిక రక్తపోటు అనేది ఒక ప్రాణాంతకరమైనది మరియు ప్రతి ఏటా వీటి వలన చాలా మంది చనిపోతున్నారు. అధిక రక్త పీడనం గుండెపోటు కలగటం, కొన్ని సమయాల్లో మూత్రపిండాలని కూడా ప్రమాదానికి గురి చేస్తుంది. మీరు స్థూలకాయత్వాన్ని కలిగి ఉన్నట్లయితే శరీర బరువు తగ్గించుకోవాలి. పాటించే జీవనశైలిలో మార్పులను చేయటం వలన అధిక రక్తపీడనాన్ని తగ్గించవచ్చు.



బ్లడ్ ప్రెజర్ రీడింగ్ 
210 - 120 - స్టేజ్ 4 హై బ్లడ్ ప్రెజర్
180 - 110 - స్టేజ్ 3 హై బ్లడ్ ప్రెజర్
160 - 100 - స్టేజ్ 2 హై బ్లడ్ ప్రెజర్
140 - 90 - స్టేజ్ 1 హై బ్లడ్ ప్రెజర్
130 - 85 - హై నార్మల్ బ్లడ్ ప్రెజర్ స్టేజ్
120 - 80 - నార్మల్ బ్లడ్ ప్రెజర్
110 - 75 - లో నార్మల్ బ్లడ్ ప్రెజర్
90 - 60 - బార్డర్ లైన్ లో బ్లడ్ ప్రెజర్
60 - 40 - టూ లో బ్లడ్ ప్రెజర్
50 - 30 - డేంజర్ బ్లడ్ ప్రెజర్
1.వాకింగ్

రోజు నడవటం వలన రక్త పీడనం సాధారణ స్థితిలో ఉంటుంది. మీరు వారంలో కేవలం 4 నుండి 5 నిమిషాల పాటు గుండె పైన ప్రభావం చూపే పనులు చేయాలి; వీటి వలన రక్తపోటు సాధారణ స్థితిలోకి చేరటం మీరు గమనించవచ్చు. రోజు 15 నిమిషాల పాటు వ్యాయామాలని చేయటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
2.ఆహరంలో ఉప్పు తగ్గించండి
మీ కుటుంబ చరిత్రలో రక్త పీడనం లేకున్నను ఉప్పు తక్కువగా తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. తీసుకునే ఆహారంలో అవసరమైతే తప్ప, ఒక చిటికెడు ఉప్పుని కూడా ఎక్కువగా వేసుకోకండి. ఎక్కువ రుచికోసం ఉప్పుకి బదులుగా నిమ్మరసం, వెల్లుల్లి, మిరియాల వంటి ఔషద రుచులను కలపండి.
 MUST READ:డక గదిలో భార్యాభర్తల ఫోటోలు ఉంచాల్సిందే

3.విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు -
నిమ్మ,ఆరెంజ్, కివి, క్రాన్ బెర్రీ, జామ, ద్రాక్ష మరియు స్ట్రా బెర్రీలలో విటమిన్ సి ఉంటుంది. చాలా స్టడీలలో విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే, అధిక రక్తపోటు తగ్గుతుందని నిరూపించబడింది. ఈ పండ్లు పచ్చివిగా లేదా వాటిని రసాలుగా తీసి తాగవచ్చు.
4.పొటాషియం
పొటాషియం శరీరంలో ప్రతికూల చర్యలను కలుగచేస్తుంది; ఏది ఏమైనప్పటికీ, ఇది శరీరానికి కావలసిన మినరల్ మరియు సోడియానికి వ్యతిరేఖంగా ఉంటుంది. కావున మీరు తీసుకునే ఆహరంలో సోడియానికి బదులుగా పోటాషియంను వాడటం మంచిది. బంగాళదుంప, నారింజ పండు రసం, అరటిపండు, ఎండుద్రాక్ష వంటి సహజసిద్ధంగా ఎక్కువ పొటాషియంను కలిగి ఉన్న పండ్లని తినండి

5.అరటి పండు -
అరటి పండ్లు శరీర శక్తిని పెంచటమే కాదు బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కనుక ప్రతిరోజూ 1 లేదా 2 అరటిపండ్లు తినాలి.
6.పచ్చని ఆకు కూరలు -
పచ్చని ఆకు కూరలలో పోషకాలు అధికం. వాటిలో ఐరన్ ఉంటుంది. ఇవి మీ అధిక రక్తపోటు తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. చర్మం మెరుపు పొందుతుంది.

7.వెల్లుల్లి -
వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మంచిది. అధిక రక్తపోటు నియంత్రణకు ప్రతిరోజూ రెండు రెబ్బలు వెల్లుల్లి తినవచ్చు.
8.టమాటాలు -
ఎర్రగా ఉండి మంచి రసాన్ని ఇచ్చే టమాటా పండులో ఎన్నో పోషకాలు, ప్రొటీన్లు ఉంటాయి. రక్తపోటు నియంత్రణకు ఈ పండు బాగా పని చేస్తుంది. వీటిలో వుండే లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సహజంగా రక్తపోటు నియంత్రిస్తుంది. దీనిలో విటమిన్ సి,ఎ,ఇ, పొటాషియం, కాల్షియం వంటివి కూడా రక్తపోటు నియంత్రిస్తాయి.


Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.