సహజసిద్ధమైన వనరులతోషాంపూ


షాంపూ లేకుండా స్నానం చెయడం కష్టమైపోయింది ఈ కాలంలో. కాని షాంపూ వాడొద్దని డెర్మటాలాజిస్ట్లు చెబుతున్నారు.ఇందులో 15 రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా సోడియంలారియెల్ సల్ఫేట్, ప్రోపోలైన్ గ్లైకాల్, టెట్రాసోడియం ఉంటాయి.చిరాకు, కళ్ళ సమస్యలు ఈ రసాయనాల వలన కలుగుతాయి.

షాంపూకి బదులు సహజసిద్ధమైన వనరులతోనే జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని కొంతకాలంగా నిపుణులు చెబుతున్నారేమో కాని, మన ఇంట్లో బామ్మకి తెలియని విషయాల ఇవి ? సరే ఇప్పుడు షాంపూకి బదులుగా ఏం వాడితే బాగుంటుందో చూద్దాం.
* గంజి జుట్టుపై వాడటం వలన కూడా లాభాల్ని పొందవచ్చు తెలుసా. గంజిలో ఉండే ఇనోసిటోల్ డ్యామేజ్ అయిన జుట్టుని బాగు చేస్తుంది. స్నానానికి ముందు గంజి జుట్టుకి పట్టి, ఓ అరగంట తరువాత కడిగేస్తే మంచిది.

* కలబంద ఆరోగ్యానికి చేయని సేవ లేదు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే దురద లాంటి సమస్యలను దూరం చేస్తుంది. షాంపూ కి బదులు అలోవేరా వాడటం వందరెట్లు మంచిది.

* ఆపిల్ సైడేడ్ వెనిగర్ అధ్బుతమైన క్లీనర్. దీన్నే ఓ చిన్ని డబ్బాలో పోసుకొని రోజూ షాంపూలా వాడుకోవచ్చు. జుట్టుకి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలకు చికిత్స ఇది.
* కుంకుడుకాయ జుట్టుకి మంచిది అని కొత్తగా చెప్పాలా. జుట్టు సమస్యలకి చాలా పురాతనమైన వైద్యం ఈ కుంకుడు కాయ. ఇది జుట్టులో మాయిశ్చర్ ని ఉంచి, జుట్టు నిగనిగలాడేలా చేయడమే కాదు, జుట్టుని బలంగా, రాలిపోకుండా తయారుచేస్తుంది.
* జుట్టుకి కొబ్బరినూనె పట్టాలని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొబ్బరినూనె పట్టడం ఇబ్బందిగా అనిపించే యువతీయువకులు రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె రాసుకొని ఉదయాన్నే తలస్నానం చేస్తే మంచిది.
* పొడవైన జుట్టు, బలమైన జుట్టు, మెరిసిపోయే జుట్టు .. వీటి గురించి మీరు కలగంటే గుడ్డుని జుట్టుకి పట్టడం మర్చిపోవద్దు.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.