వంట త్వరగా పూర్తవ్వాలంటే.


కొన్ని చిట్కాలు ఫాలో అయినపుడే వంట త్వరగా పూర్తవుతుంది. ఆహార పదార్థాలు పాడవకుండా ఉండాలన్నా కొన్ని చిట్కాలను ఫాలో కావాల్సిందే. చిన్న చిన్న చిట్కాలే రోజుల తరబడి పదార్థాలు నిలువ ఉండేలా చేస్తాయి. కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి.

చపాతీలు మెత్తగా రావాలంటే చల్లని నీళ్లకు బదులుగా గోరు వెచ్చని నీళ్లు పోసి పిండి కలపాలి. ఇంకా మెత్తగా, మృదువుగా కావాలనుకుంటే ఇంట్లో తయారుచేసుకున్న పన్నీర్‌ కలుపుకోవచ్చు.

కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏదైనా ప్లాస్టిక్‌ డబ్బాలో వేసి గట్టిగా మూతబిగించాలి. ఒకవేళ నీటితో కడిగినట్లయితే ఆరనిచ్చి, తడి లేకుండా చేసిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి. 

ఫ్రిజ్‌లో చేపలు నిలువ ఉంచుకుంటున్నట్లయితే వాటికి కొద్దిగా ఉప్పు, పసుపు జోడించి రబ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల చేపలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. 

also read   చపాతీలు మెత్తగా ఉండాలంటే

వంట చేసే సమయంలో సమయం ఆదా కావాలంటే ముందే వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వారం రోజుల వరకు వెల్లుల్లి రెబ్బలు తాజాగా ఉంటాయి.

రాజ్‌మా వండాలంటే ఎక్కువ సమయం ఉడకించాల్సి వస్తుంది. అయితే రాజ్‌మా సులువుగా ఉడకాలంటే గోరువెచ్చని నీటిలో ముందుగా నానబెట్టాలి. తరువాత అదే నీటితో ఉడికించాలి. 

బంగాళదుంప సబ్జీ చేస్తున్నట్లయితే ముందుగా బంగాళదుంపల పొట్టు తీసి చల్లని నీటిలో అరగంటల నుంచి నలభైఐదు నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని మసాలా వేసి ఫ్రై చేసుకోవచ్చు.

అన్నం మెత్తగా కాకుండా పుల్లలు పుల్లలుగా రావాలంటే ఉడికించే ముందు కొద్దిగా నెయ్యి లేక నూనె వేయాలి. దీనివల్ల అన్నం అంటుకోకుండా తయారవుతుంది.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.