ఆయిల్ పుల్లింగ్ చేయడం వలన ఉపయోగాలు



ఆయిల్ పుల్లింగ్.అంటే పొద్దునే బ్రష్ చేసి ఆ తర్వాత పరిశుభ్రమైన, శుద్ధి చేయబడిన సన్‌‌ప్లవర్‌ ఆయిల్‌, వేరుశనగ, కొబ్బరి నూనె, నువ్వుల నూనెలలో ఏదో ఒకటి ఒక టేబుల్‌ స్పూన్‌ పరిమాణంలో నోటిలో వేసుకొని, నోటి భాగమంతా, పళ్ళ సందుల మధ్య తిరిగేలా పదిహేను నుండి ఇరవై నిమిషాల దాకా పుక్కిలించడం ఆ తర్వాత ఉమ్మివేయడం.దీని వల్ల చాలా లాభాలు వున్నాయి.

ఆయిల్ పుల్లింగ్ చేయడం వలన ఉపయోగాలు
ఉపయోగాలు -
* ఉపిరితిత్తుల్లోని కఫం ఆయిల్ పుల్లింగ్ వలన తగ్గిపొతుంది.

* ముక్కునుండి నీరు కారడం తగ్గును .

* తగ్గని మొండి తుమ్ము లు తగ్గును .

* ఆస్తమా తగ్గును .

* పంటినోప్పులు తగ్గుతాయి .

* కీల్లవాతం , ఆర్తరైటిస్ తగ్గును .

* దగ్గు , అలర్జీ , నంజు తగ్గును .

* చర్మ వ్యాదులు తగ్గును .

* కడుపులో మంట తగ్గును .

* కళ్ళ కింద వచ్చే నల్లటి మచ్చలు ఒక సంవత్సరం లొ తగ్గును .
* ఆపరేషన్ చేయడానికి వీలులేని కనుతులు ఈ విధానం ద్వారా మెత్తబడి తగ్గును .

* రక్తపోటు అదుపులోకి వచ్చును.

* ఆటలమ్మ రావడం వలన ముఖం , శరీరం పైన ఏర్పడిన చిన్నచిన్న గుంటలు మచ్చలు మాయం అవుతాయి.

* మదుమేహ వ్యాధిగ్రస్తులు ఈ థెరపిని ఆచరించడం వలన 6 నెలల్లో బ్లడ్ షుగర్ , యురిన్ షుగర్ నార్మల్ కి వచ్చినట్టు పరిశొధనలలొ తేలింది . 

* మదుమేహ వ్యాదిగ్రస్తునకి కాలివేలికి గోరుచుట్టు వస్తే అతనికి కేవలం నెలరోజులలో ఈ థెరపిని ఆచరించడం వలన గొరుచుట్టు నయం అయ్యింది.

* 90 సంవత్సరాలు వయస్సు కలిగిన స్త్రీ సంవత్సర కాలం ఈ ప్రక్రియ ద్వారా మదుమేహ వ్యాధి నుంచి విముక్తిరాలు అయ్యింది .

* నిద్రలేమి తగ్గుతుంది .

* జ్వరం , ఆయాసం తగ్గుతుంది .

* సంభోగ సమస్యలు నివారణ అవుతాయి .

* ఫ్లూ అదుపులోకి వస్తుంది.

* స్త్రీల వక్షోజ నొప్పులు తగ్గును .

* నడుమునొప్పి తగ్గును .

* అజీర్ణ వ్యాధులు నయం అగును.

* తలవెంట్రుకలు రాలడం ఆగును.

* తలబారం , చాతినొప్పి తగ్గును .

* గ్యాస్ బాదలు తొలగును.

* మలబద్దకం పోవును .

* ఇస్నోఫీలియా అను శ్వాస సంబంధ వ్యాదులు నయం అగును.

* చెమట వాసన పోవును .

* స్థౌల్య రోగం నివారణ అగును.

ఈ విదంగా సుమారు 50 రోగాలు ఈ థెరపి ఆచరించడం వలన తగ్గును .
సాధారణంగా ఆయిల్ పుల్లింగ్ చేసేవారికి ఇంచుమించు జిడ్డుగా చిక్కగా ఉండే నూనె తెల్లటి నురుగుగా మారును. అయితే కొంతమందికి లాలాజలం తక్కువుగా ఊరును. అందువలన అటువంటి వారికి తెల్లటి నురుగుగా మారడానికి 50 నిమిషాలు వరకు పడుతుంది. దీనికి వారు ఎక్కువ నీరు సేవించాలి . కొందరు కట్టుడు దంతాలు కట్టించుకుంటారు. దంతాలు లేకున్ననుఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు . కాని నూనెని మింగకుండా చూడాలి.

ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఈ థెరపిని ఆచరించడం వలన తొందరగా రోగాల నుండి విముక్తి పొందుతారు. ఇది అత్యంత ప్రాచీన ఆయుర్వేద విధానం . దీనిని పాటించి వీలయినంత తొందరగా రోగాల నుంచి విముక్తి పొందగలరు.

************* కాళహస్తి వెంకటేశ్వరరావు *************

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.