అమ్మ లాంటి నిమ్మ

రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తిబాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది.
కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా పళ్ళు తోముకుంటే పలువర మెరవడమే కాకుండా, చిగుళ్ళవ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
must read చపాతి చేసే మేలు
ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం, నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం.
శరీరం నీరసించినపుడు సెలైన్‌కు ప్రత్యామ్నాయంగా కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది
మంచి పోషకపదార్ధాలతోపాటు ఎక్కువగా నిమ్మరసం సేవిస్తూంటే స్త్రీలకు గర్భస్రావాలు జరగవు.
వేడివల్ల కలిగే జలుబుకు, నిమ్మషర్బత్ బాగా పనిచేస్తుంది.
వడదెబ్బ నిమ్మనీళ్ళలో ఉప్పు కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
"నిమ్మ చేయు మేలు అమ్మ కూడా చేయదు" అన్నది ఒక తెలుగు లోకోక్తి. ఈ ఉక్తి ద్వారా నిమ్మకాయలోని గొప్పదనం తెలుస్తున్నది. అమ్మ ప్రేమ-మమత-వాత్సల్యాలను ఇవ్వగలదే కానీ, ఆరోగ్యాన్ని ఇవ్వలేదు కదా! నిమ్మ ఆ కొరతను తీరుస్తుందని వైద్యుల అభిప్రాయం. నిమ్మరసం వల్ల అనేక వ్యాధులు నివారింపబడతాయి.
మలబద్ధకము, అజీర్ణం, అగ్నిమాంద్యం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీరోజూ రెండు పూటలా నిమ్మరసం త్రాగితే జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. ఆకలి పెరిగి, బరువు హెచ్చుతుంది.
లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి, రోజుకు రెండు మూడుసార్లు నిమ్మరసం సేవిస్తే, బరువు తగ్గుతుంది.
రోజుకు నాలుగుసార్లు నిమ్మరసం త్రాగితే పచ్చకామెర్ల వ్యాధి తగ్గుతుంది.
వేడినీటిలో నిమ్మరసం పిండి త్రాగితే ఉబ్బసం ఉపశమిస్తుంది.
గజ్జి, తామర, చుండ్రు, పొడలు, వ్రణాలు, మొటిమలు, కుష్టు మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. లాభం ఉంటుంది.
గజ నిమ్మరసాన్ని (ఒక కాయ) 20 గ్రా. కొబ్బరినూనెలో పిండి, తలకూ, ముఖానికి, శరీరానికి రాసుకుని, ఎండలో 15 ని|| ఉండి తర్వాత స్నానం చేస్తే, అనేక చర్మ వ్యాధులు నివారితమౌతాయి. నిమ్మకాయను క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తారు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వారానికి ఒకమారు నిమ్మనూనె రుద్దుకుంటే చర్మానికి ఆరోగ్యం, కాంతి చేకూరుతాయి. నల్లమచ్చలు గలవారు ఈ నూనెను 40 రోజుల వరకు రుద్దుకుంటే, ఫలితం కనబడుతుంది.
నంజు, నీరు, వాపులు కలవారు వేడినీటితో నిమ్మరసాన్ని త్రాగితే, మూత్రవిసర్జన అధికంగా జరిగి, రోగనివారణ అవుతుంది.
మధుమేహం, రక్త మూత్రం, అతివేడి అగిర్త, ఎండదెబ్బ, వడదెబ్బ, మొదలగు వ్యాధులకు నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది.
రక్తప్రసరం, శ్వేతప్రసరం, పాండువ, రక్తచీణ్త, క్షయ మొదలగు రోగాల్లో కూడా నిమ్మరసం ప్రయోజనకారిగా ఉంటుంది.
కండ్ల కలకలు కంటి మసకలకు రెండు నిమ్మరసం చుక్కల్ని మూడు రోజులు వేసుకోవాలి; తగ్గుతాయి.
చెవిలో కురుపు, చీము, బాధ ఉంటే, నిమ్మరసం చుక్కలు, కొబ్బరి నూనె కలిపి మూడు రోజులు వేసుకుంటే తగ్గిపోతాయి.
నిమ్మతొక్కలు ఎండవేసి, కొన్ని ఉలవలు లేదా పెసలు కలిపి, మరపట్టించి, ఆ పిండిని చర్మానికి రాసుకుని స్నానం చేస్తే, చర్మం నిగ నిగ లాడుతూ ఉంటుంది.
వివిధ వంటకాలల్లో నిమ్మకాయను ఉపయోగించవచ్చు.
పచ్చి కూరలు సన్నగా తురిమి వాటిలో నిమ్మకాయ పిండుకుని తింటే, ఆరోగ్యం, రుచి రెండూ లభిస్తాయి.
మజ్జిగలో నిమ్మకయ పిండుకుని త్రాగితే, వేడితాపం చల్లబడుతుంది.
నిమ్మ పచ్చడి ఆరోగ్యదాయకం.
ఇన్ని సుగుణాలున్నవి కాబట్టి నిమ్మచెట్టును ప్రతి ఇంటిలోనూ పెంచుకోవటం మంచిది. నిమ్మచెట్టును పెంచి, దాని ద్వారా లాభం పొందాలి.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.