మునగచెట్టు 300 రకాల వ్యాధులని రాకుండా చేస్తుంది.

ఆయుర్వేదం మన పూర్వీకులు మనకు అందించిన వరం. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆయుర్వేదం వైపు చూస్తుంది. దానికి కారణం రెగ్యులర్ మెడిసిన్ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా రావడం మరియు దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని రోజుల తరువాత తిరిగి రావడం. ఆయుర్వేదం ప్రకారం మనము రోజు వంటలలో వాడే పదార్దాలు, ఆకుకూరలు, కూరగాయలలోని పోషకాలే చాలా రోగాలు నయం చేస్తాయి. అలాంటి పోషక విలువలు ఉన్న చెట్టు “మునగచెట్టు”. మునగచెట్టు ఆకులలో, కాయలలో, బెరడులో చాల పోషకవిలువలు ఉన్నాయి. చాలమంది మునగకాయతో పాటు ఆ చెట్టు ఆకులతో కూడా వంట చేసుకుంటారు. మీరు ఇంతకుముందు మునగ ఆకు వాడనట్లైతె ఇక ముందు వాడటం మొదలుపెట్టండి. మునగ ఆకు యొక్క ఉపయోగాలు క్రింద చదివి తెలుసుకోండి. మునగ ఆకును చాలా ఆయుర్వేద మందుల తయారిలో వాడుతారు మరియు ఈ మునగచెట్టు దాదాపు 300 రకాల వ్యాధుల నుండి మనలను కాపాడుతుంది.

must read  చపాతి చేసే మేలు
100 గ్రాముల మునగాకులో నిల్వ ఉండే పోషక పదార్థాలు:

  • మాంసకృతులు – 6.7
  • పిండి పదార్థాలు – 13.4 గ్రాములు
  • కాల్షియం – 440 మిల్లి గ్రాములు
  • నీరు 75.9%
  • ఫ్యాట్స్ -17 గ్రాములు
  • ఎనర్జీ – 97 క్యాలరీలు
  • ఐరన్ c – 200 మిల్లి గ్రాములు
  • ఖనిజ లవణాలు – 2.3 %
  • పీచు పదార్థాలు – 0.9 క్యాలరీలు
ములక్కాయ వలన లాభాలు:
  • మనం రోజు తాగే పాలలో ఉండే కాల్షియం మునగాకులో 17 రేట్లు ఎక్కువగా ఉంటుంది
  • మునగాకును ఆయుర్వేదంలో మెడిసిన్ గా వాడుతారు.
  • పెరుగులో ఉండే ప్రోటీన్స్ మునగాకులో 8 రేట్లు ఎక్కువగా ఉంటాయి.
  • మునగాకులో విటమిన్స్ A,C మరియు కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి
  • బ్లడ్ లోని షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చెయ్యడానికి మునగలోనీ క్లోరోజెనిక్ ఉపయోగపడుతుంది.
  • లివర్, ఒవేరియన్, మొలనోమా వంటి ప్రాణాంతకమైన క్యాన్సర్స్ ని తగ్గించే శక్తి మునగాకుకి ఉంది.
  • అరటి పండులో ఉండే ప్రోటీన్స్ మునగాకులో 15 రేట్లు ఎక్కువగా ఉంటాయి.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.