నీళ్ళలా ఉండి, జిగటగా ఉండి, రంగులేనిద్రవ పదార్ధమే లాలాజలము.ఇది మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడానికి అత్యంతవసరం. దీనిలో 98% నీరు, 2% ఎంజైములు ఉంటాయి. ఎంజైములలో కెల్లా ముఖ్యమైనది 'టైలిన్'(ptyalin enzyme). ఇది నమిలిన ఆహారాన్ని పంచదారగా మారుస్తుంది. దీన్నే 'మాల్టోస్' అంటారు. దీని మరో ఎంజైమ్ 'లిసోజిమ్'(lysozyme enzyme). ఇది నోటి ద్వారా శరీరంలో ప్రవేశించే బాక్టీరియాను నాశనం చేస్తుంది.
అంతేకాకుండా ఆహారాన్ని బాగా నమిలితే నోటిలో బాగా ఊరే లాలాజలం అన్ననాళం గుండా ఆహారం ఉదరంలోకి సులువుగా చేరడానికి సహాయపడుతుంది. నోటిని తడిగానూ ఉంచుతుంది.నోటిలో లాలాజలము నిరంతరము ఊరడము వలన నోరు , నాలుక ఎండిపోకుండా ఉంటాయి. పెదవులు పగిలి పోకుండా ఉంటాయి. నాలుకను రక్షించేది లాలాజలమే. లాలాజలము ఉండబట్టే ఆహారము రుచులు తెలుసుకోవడము వీలవుతుంది .
ఆహారాన్ని చూడగానే నాడులు లాలాజల గ్రంధులకు సంకేతాలను ఇస్తాయి.అప్పుడు గ్రంధుల నుంచి 'లాలాజలం' (ఎంగిలి,ఉమ్ము) స్రవించనారంభిస్తుంది. ప్రతిరోజూ మన నోటి నుండి దాదాపుగా 1.5 లీటర్ల లాలాజలం ఊరుతుంది. మన జీవిత కాలములో ఒక వ్యక్తి లో ఊరే లాలాజము సుమారు 2 స్విమ్మింగ్ ఫూల్స్ నిండేంతగా ఉంటుంది.
- డా.వందనా శేషగిరిరావు, శ్రీకాకుళం.
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.