ఉల్లిపాయలు తరిగితే కన్నీళ్లేందుకు వస్తాయి ?


ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు కళ్ల నుంచి నీళ్లు కారుతుంటాయనే విషయం తెలుసు కదా! ఇలా జరగ డానికి హేతుబద్ధమైన కారణం ఉంది. మన కళ్లను మండించే ఒక పదార్థం ఉల్లిపాయలో ఉంటుంది. దీని పేరు "ప్రొపిన్ సల్ఫినిన్". ఉల్లిపాయను కోయగానే ఈ పదార్థం గాలిలో కలిసి మన కళ్లకు తగులుతుంది. వెంటనే మన కళ్లు మండి కన్నీళ్లు ధారలా కారిపోతుంటాయి. ఎవరైనా చూస్తే మనం కన్నీరుపెట్టుకుని ఏడ్చినట్లు కన్పిస్తుంది.

ఇలా కళ్ళ నుండి నీరు కారటం కూడా మంచిదేనని సైన్స్ చెబుతోంది. ఎందుకంటే సాధారణంగా గాలిలో ఉన్న ధూళికణాలు కళ్లలోకి చేరుతుంటాయి. మనం ఏడ్చినప్పుడు కారే నీళ్లతో పాటు ధూళికూడా బయటకు పోయి కళ్లు శుభ్రపడతాయి. అందుకే చాలా మంది కళ్ల నుంచి నీరు కారితే కళ్లకి మంచిదని చెప్తారు. ఇలా ఉల్లిపాయలు మన కళ్ళను కూడా శుభ్రపరిచేందుకు ఉపయోగపడుతుంటాయి.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.