మెరుగైన కంటి చూపు కోసం సులువైన చిట్కాలు.

.

కొన్ని స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాలు పాటించటం వలన కంటి సంబంధ స‌మ‌స్య ఏదైనా సుల‌భంగా దూర‌మ‌వుతుంది. ఆ చిట్కాల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
  • రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే కంటి సంబంధ స‌మ‌స్య‌లు వెంట‌నే దూర‌మ‌వుతాయి. క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ, బీటా కెరోటిన్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. ఇవి దృష్టి సంబంధ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాయి. చూపు స్ప‌ష్ట‌త‌ను పెంచుతాయి.

  • ఇటీవల స్మార్ట్‌ఫోన్లు, కంప్యూట‌ర్ల వాడ‌కం ఎక్కువైంది. దీనికి తోడు బ‌య‌ట తిర‌గ‌డం, ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటే ఆ ప్ర‌భావం క‌ళ్ల‌పై కూడా ప‌డుతుంది. రోజూ పగటి సమయంలో క‌నీసం 3 గంట‌ల పాటు క‌ళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకుంటే ఈ ఒత్తిడి నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

  • రోజులో కొంత స‌మయం పాటు ఆహ్లాద‌క‌ర‌మైన ప‌చ్చ‌ని ప్ర‌కృతిని చూడండి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల‌కు ఎంత‌గానో హాయి క‌లుగుతుంది. ఇది కళ్ళకు పూర్తి స్థాయిలో హాయినిస్తుంది.

  • కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌ల‌ను ఎక్కువ‌గా ధ‌రించే వారు రోజులో కొంత స‌మ‌యం పాటు వాటికి దూరంగా ఉండేందుకు ప్రయ‌త్నించండి. దీని వ‌ల్ల లెన్స్‌ల ద్వారా క‌ళ్ల‌పై ప‌డే ఒత్తిడి త‌గ్గుతుంది.


  • కంప్యూట‌ర్ల‌పై ఎక్కువ‌గా ప‌నిచేసేవారు అవ‌స‌ర‌మైతేనే వాటిని వాడాలి. లేదంటే దూరంగా ఉండాలి. వీలైనంత వ‌ర‌కు కంప్యూట‌ర్ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయ‌త్నించాలి.

  • క‌ళ్ల‌ను నిత్యం కొంత సమ‌యం పాటు సున్నితంగా మ‌సాజ్ చేయాలి. ఇలా చేస్తే క‌ళ్ల‌కు విశ్రాంతి క‌లుగుతుంది.

  • రోజూ ఒక అరగంట పాటు గోరు వెచ్చ‌ని త‌డి గుడ్డ‌తో క‌ళ్ల‌ను సున్నితంగా ఒత్తిన‌ట్టు చేయాలి. ఇది క‌ళ్ల‌కు హాయినిస్తుంది.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.