కావల్సినవి:
ధనియాలపొడి, ఆవపొడి - చెంచా చొప్పున, జీలకర్రపొడి - అరచెంచా, మెంతిపొడి - పావు చెంచా, కారం - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, ఇంగువ - చిటికెడు, క్యారెట్లు - పదిహేను (చెక్కు తీసి ముక్కల్లా తరగాలి), ఉల్లిపాయలు - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - అరచెంచా, ఎండుమిర్చి - రెండు, కరివేపాకు - రెండురెబ్బలు, చక్కెర - కొద్దిగా, నిమ్మరసం - మూడు చెంచాలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర - పావుచెంచా చొప్పున, నూనె - కప్పు.
తయారీ:
ఉల్లిపాయల్ని తరిగి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో అరకప్పు నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చిని వేయించాలి. ఆ తరవాత కరివేపాకు రెబ్బలు వేసి అవి కూడా వేగాక ఇంగువ, ఉల్లిపాయ మిశ్రమం, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయల పచ్చివాసన పోయాక దింపేయాలి. అందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, నిమ్మరసం, తగినంత ఉప్పుతోపాటు మిగిలిన అన్ని పదార్థాల్నీ వేసేయాలి. మిగిలిన నూనె కూడా వేసేస్తే స్పైసీ క్యారెట్ పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలోకే కాదు.. చపాతీల్లోకీ బాగుంటుంది.