అందమైన పెదాల కోసం చిట్కా


ముఖానికి అందాన్ని ఇచ్చేవి పెద‌వులు..  మన ఆరోగ్యాన్ని పెద‌వులే సూచిస్తాయి. పెద‌వులు అందంగా ఉంటే మొఖానికే కొత్త క‌ల వ‌స్తుంది.. అలాంటి పెద‌వుల‌కు అందాన్నిచే కొన్ని చిట్కాలు మీకోసం.. 

*కుంకుమపువ్వు, ఒక టీస్పూన్ పాలు, టీస్పూన్ మీగడపాలు మిశ్రమంగా చేసి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి.. కాస్త చల్లబడిన ఈ మిశ్రమాన్ని పెదాల మీద రాసుకుని కొంతసేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత దూదితో పెదాలను సున్నితంగా తుడిచేయాలి ఇలా చేస్తే మీ పెద‌వులు గులాబీ వ‌ర్ణంలో మారి అందంగా క‌నిపిస్తాయి.. 

*గులాబీ రెమ్మల్ని పేస్టుగా చేసి దాన్ని పాలలో కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. కొద్దిసేపటి తర్వాత పాలలో తడిపిన దూదితో పెదాలను తుడిచేయాలి.

*బీట్‌రూట్ రసంలో మీగడ కలిపి ఆ పేస్ట్‌ని పెదాలకు ఐప్లె చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
*టమాటా పేస్టు, మీగడ రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా పెదాలకు ఐప్లె చేస్తే నల్లటి పెదాలు ఎర్రగా మారుతాయి.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.