అందంగా కనిపించడం కోసం అద్భుత చిట్కాలు


గులాబీ నీరు (Rose Water), గ్లిజరిన్ (Glycerin), వడపోసిన నిమ్మరసం (స్వచ్చమైనది) సమభాగాలలో కలిపి ఒక సీసాలో వేసి బాగా కలిపి నిలువ ఉంచుకోవాలి. రోజు నిద్రించే ముందు 10 చుక్కలు ముఖానికి సున్నితంగా రుద్దుకొని ఉదయం కడుగేసుకుంటే ముఖం పైన ఉన్న మచ్చలు, మొటిమలు, ముడతలు మొదలైన వికారాలు అన్ని హరించి పోయి ముఖం చిన్న పిల్లల  ముఖంలా లేతగా, నున్నగా, కాంతివంతంగా తయారవుతుంది.  
ముఖ సౌందర్యాన్ని పెంచేందుకు ఇంకో చిట్కా... ఒక వెడల్పాటి పాత్రలో మంచినీరు తీసుకోండి. అందులో మెంతులు, మందారాకు, బిర్యానీ ఆకులు వేసి మరిగించండి. తలపై మందంగావున్న వస్త్రాన్ని కప్పుకొని ఐదు నిమిషాలపాటు ముఖానికి ఆవిరి పట్టండి. ఇలా చేయడం వల్ల మూసుకుపోయిన స్వేద గ్రంథులు తెరుచుకొని మురికి బయటకు వచ్చేస్తుంది. దీంతో రక్తప్రసరణ మెరుగవుతుంది, కండరాల నొప్పులు, ఒత్తిడి మటుమాయమౌతాయి. దీంతో శరీరం ఉత్తేజితమవుతుంది. 

ఆ తర్వాత బాదం, ఓట్‌మీల్ పొడులను సమానంగా తీసుకొని హెర్బల్‌టీ, లావెండర్‌నూనె వేసి పేస్ట్ లా కలుపుకోవాలి. దీనిని ముఖానికి రాసుకొని నెమ్మదిగా మర్దన చేయండి. దీనివల్ల ముఖంపైనున్న మొటిమలు, బ్లాక్‌హెడ్స్, మృతకణాలు తొలగిపోతాయి. స్క్రబ్ ప్యాక్ తొలగించాక ఆల్కహాలిక్ స్వభావం లేని టోనర్‌ను ముఖానికి రాయండి. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. చివరిగా నలుగుపెట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మీ ముఖ చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. 

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.