వాము అన్నము తయారుచేసే విధానం


వాము అన్నం చేసుకుని, వేడి వేడిగా తింటే, చాలా హితవుగా ఉంటుంది.

కావలసిన పదార్ధాలు :
అన్నం - 3 కప్పులు
రెండు చెంచాలు నెయ్యి
వాము - 2 చెంచాలు
వెల్లుల్లిపాయలు - 10-15 రెబ్బలు
ఆవాలు, మినప్పప్పు - తలో అర స్పూన్
ఎండుమిర్చి - 4
ఉప్పు -తగినంత
కాస్త కర్వేపాకు
తయారీ విధానం 
ముందుగా ఒక మూకుడులో నెయ్యి వేసి, వేడెక్కాకా, ఆవాలు, మినప్పప్పు, వాము, ఎండు మిర్చి వేసుకుని, బాగా వేయించుకోవాలి. అవి వేగాకా, వెల్లుల్లిపాయలు, కర్వేపాకు వేసుకుని, బాగా వేయించాలి. ఆ తర్వాత అన్నం, తగినంత ఉప్పు వేసి, ఐదు నిముషాలు వేయించి, తీసెయ్యాలి. అంతే, వేడి,వేడి వామన్నం తయారు. చాలా సులభం, మీరూ ప్రయత్నించండి మరి.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.