పెళ్ళి ఐన వాళ్ళు తప్పకుండ చదవండి .

సక్సెస్ ఫుల్ కపుల్స్ ఫాలో అయ్యే ఐదు Secrets........

💗💜💗💜💛❤️💜💗
పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు. అది నిజమే. కానీ అందరి జీవితాలకు, బాంధవ్యాలకు కరెక్ట్ కాకపోవచ్చు.
కొంతమంది.. కలకాలం అన్యోన్యంగా, సంతోషంగా ఉంటారు.
కానీ కొంతమంది చీటికిమాటికీ వాదులాడుకుంటూ, గొడవలతో రిలేషన్ లో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.
ఇద్దరి మధ్య రిలేషన్ హ్యాపీగా ఉండాలి అంటే ఏ ఒక్కరి సహకారం సరిపోదు. ఇద్దరికీ సర్దుకుపోయే తత్వం ఉండాలి.
ప్రేమపంచే గుణం ఉండాలి. రిలేషన్ షిప్ లో సక్సెస్ అవ్వాలంటే..
ఫాలో అవ్వాల్సిన సక్సెస్ ఫుల్ హ్యాబిట్స్ కొన్ని ఉన్నాయి. వీటిని కాస్త మీ రిలేషన్ లో చేర్చుకోండి.. మీ బంధాన్ని బలపరుచుకోండి.
మీ భాగస్వామికి మొదటి ప్రాధాన్యత ఏ విషయంలోనైనా మీ భాగస్వామికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
పిల్లలు కూడా సెకండ్ ప్లేస్ లోనే ఉంటారు. ఎందుకంటే.. మీ పేరెంట్స్, పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ వెళ్లిపోయినా..
మీ జీవితం చివరి వరకు మీతో గడిపేది మీ భాగస్వామే. కాబట్టి.. మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ మీ భాగస్వామికే ఇవ్వడం అలవాటు చేసుకోండి.
ప్రేమ పెళ్లైన కొంతకాలం వరకే రిలేషన్ లో ప్రేమ ఉంటుందని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు. కానీ.. మీ భాగస్వామికి జీవితాంతం ప్రేమ పంచండి.
పిల్లలు, మీ తల్లిదండ్రులతో లైఫ్ బిజీగా మారినా.. మీ పార్ట్ నర్ తో స్పెండ్ చేసే టైమ్ ని మాత్రం మిస్సవకండి.
ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉన్నా.. కొంత సమయం మీ భాగస్వామితో గడపండి. ప్రేమను పంచండి.....
పోలిక ఇతరులతో పోల్చడం, క్రిటిసైజ్ చేయడం వంటి పనులు చేయకండి. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అంగీకరించడం అలవాటు చేసుకోండి.
ప్రతి సారి జాగ్రత్తగా వ్యవహరించడం లేదని నిందించకండి. ప్రతిసారీ మీ పార్ట్ నర్ ని తక్కువ చేసి చూడటం వల్ల రిలేషన్ లో మనస్పర్థలు వస్తాయి.
ఫ్రెండ్లీగా ఉండటం అలవాటుగా మార్చుకుంటే.. మీ రిలేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.
" ప్రేమ అంటే అందం చూసి పుట్టేది కాదు...
అలా పుట్టిన ప్రేమ ఎప్పటికీ గేలవదు...
ఒకటి చెప్పనా మిత్రులారా మీది...
నిజమైన ప్రేమ అయితే ఇలా అనిపించిందా...
మీరు ప్రేమించిన అమ్మాయి మీ పక్కన
ఉన్నపుడు మీ అమ్మలా కనిపించిందా...
మీరు ప్రేమించిన అబ్బాయి మిమ్మల్ని...
గుండెలకు హత్తుకున్నప్పుడు మీ నాన్న...
గుర్తుకు వచ్చాడా ఆలోచించండి...
మీది నిజమైన ప్రేమ అయితే అలా జరుగుతుంది...
" ప్రేమించండి ప్రేమని పంచండి "

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.